తండ్రి కూరగాయాల వ్యాపారి.. కొడుకు కోరుకున్న కొలువు సాధించాడు

Maharashtra: Pune Vegetable Seller Son Got Dream Job At Us Amazon - Sakshi

పూణె (ముంబై): కలలు కనండి, వాటిని నిజం చేసుకోండనే మాట వినే ఉంటాం. కాకపోతే కలలను నిజం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఓ వ్యక్తి తన కలల కోసం పట్టువదలకుండా శ్రమించి చివరికి సాధించాడు మహరాష్ట్రలోని ఓ కూర‌గాయ‌ల వ్యాపారి కుమారుడు. 

వివరాల్లోకి వెళితే.. పూణెలోని కూర‌గాయ‌ల వ్యాపారి కుమారుడు హృషీకేష్ ర‌స్క‌ర్ త‌న క‌లలను నిజం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌లో తాను కోరుకున్న జాబ్ కొట్టేశాడు. కాగా ఈ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డ రస్కర్‌ చివరకు ఎన్నో వ్యయప్రయాసలు దాటుకుని సాధించాడు. అతను.. ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్నాడు. మొదట తాను ఆశించిన ఉద్యోగం ల‌భించ‌క‌పోవ‌డంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పలు ఉద్యోగాలను వ‌దిలేశాడు. తన కుటుంబ ఆర్థిక ప‌రిస్ధితి తెలుసుకాబట్టి ఆన్‌లైన్‌లో ట్యూష‌న్లు చెప్పడం ప్రారంభించాడు. అలా వచ్చిన సొమ్ముతో తన ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించి ఆపై త‌న క‌ల నెర‌వేర్చుకున్నాడు.

బ్యాకెండ్ ఇంజ‌నీర్‌లో నైపుణ్యాలు సాధించిన ర‌స్క‌ర్ తాను కలలను నిజం చేసుకోవడానికి రోజుకు 12 నుంచి 14 గంట‌లు క‌ష్టప‌డ్డాడు. తన విజయానికి మొదట నుంచి మ‌ద్దతుగా నిలిచిన కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు ధ‌న్యవాదాలు తెలిపారు. తాను అభ్యసించిన ఇంజ‌నీరింగ్ కాన్సెప్ట్స్‌ను మెరుగ్గా తిరిగి నేర్చుకోవడం కూడా తనకు బాగా ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. అమెజాన్‌ లాంటి అంతర్జాతీయ కంపెనీలో రస్కర్‌ ఉద్యోగం సాధించడంతో తమ క‌ష్టాలు తీరనున్నాయని అత‌ని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top