షాకింగ్‌ ఘటన: పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి 5 ఏళ్లు జైలు శిక్ష

Madhya Pradesh Court Sentenced Headmaster To 5 Years Jail - Sakshi

ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేక కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరజ్‌పురకాలన్‌లోని ప్రభుత్వ మిడిల్‌ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రభాన్‌ సేన్‌ గెస్ట్‌ టీచర్‌ లక్ష్మీకాంత్‌ శర్మ అనే వ్యక్తిని పనిలో చేర్చుకునేందుకు రూ. 2 వేల రూపాయాలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

దీంతో ప్రత్యేక న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాన్‌ సేన్‌ను దోషిగా తేల్చి.. ఐదేళ్ల జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 30 వేల రూపాయాలు జరిమాన కూడా విధించింది. సదరు గెస్ట్‌ టీచర్‌ శర్మ ఈ విషయమై జనవరి 6, 2015న లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజల్లోనే వారు వేసిన ప్లాన్‌లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు.

ఈ మేరకు న్యాయమూర్తి సిన్హా మాట్లాడుతూ...ప్రభుత్వ సేవకులు అవినీతికి పాల్పడటం అనేది సమాజంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. అందులోకి ఉపాధ్యాయుడు సమాజంలో కీలకమైన భాగం, పైగా అందరికీ మార్గదర్శి. అలాంటి వ్యక్తే అవినీతికి పాల్పడితే సమాజానికే చేటు అంటూ..సదరు ఉపాధ్యాయుడికి ఈ విధంగా శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 

(చదవండి: పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌..త్రుటిలో తప్పించుకున్న మహిళ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top