ఆమెకు రూ.10కోట్లు కావాలి అందుకే ఇలా...: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Madhya Pradesh Congress MLA Charged For Criminal Intimidation - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉమంగ్‌ సింఘార్‌.. భార్య ఫిర్యాదు మేరకు గృహహింస, అత్యాచారం, బెదిరింపులు వంటి క్రిమినల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఉమంగ్‌ భార్య తన ఇంటి సహాయకురాలి భర్త పేరుతో కూడా ఆస్తులు కలిగి ఉన్నారని, అలాగే ఆయన సహజీవనం చేసిన సోనియా భరద్వాజ్‌ ఆత్మహత్యలో కూడా ఉమంగ్‌ ప్రమేయం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో ఆయనపై నౌగోన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐతే ఆ ఆరోపణలన్నింటిని ఖండించారు ఉమంగ్‌. తన భార్య తనను బ్లాక్‌మెయిల్‌​ చేస్తోందని చెప్పారు. తనను మానసికంగా వేధించి, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నందుకు నవంబర్‌2న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. అంతేగాక తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ. 10 కోట్లు డిమాండ్‌ చేసిందని ఆరోపణలు చేశారు.

ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్‌ కూడా ఆ ఆరోపణలకు బలం చేకూరేలా ఉమంగ్‌కు గతంలో కొంతమంది భార్యలు ఉన్నారని అన్నారు. ఐతే ఉమంగ్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శక్తిమంతమైన గిరిజన నాయకుడు. పైగా మాజీ ముఖ్యమంత్రి జమునాదేవి మేనల్లుడు కూడా. గత కమల్‌ నాథ్‌ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన ఉమంగ్‌ ప్రస్తుతం గంద్వాని స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

(చదవండి: దాహమేసి నీరు తాగిందని.. గోమూత్రంతో వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం!)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top