గుడ్‌న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

LPG Cylindar Gas Reduce 10 Rupees Announced Indian Gas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరాటంకంగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా మొత్తం సబ్సిడీ ఎత్తివేస్తోంది. దీంతో సామాన్యుడు వంట చేసుకోలేని విధంగా మారింది. అయితే ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలిగే వార్త వచ్చింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి గ్యాస్‌ బండపై రూ.10 తగ్గనుంది.

ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ బుధవారం ప్రకటించింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్‌ సిలిండర్‌ లభించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్‌ ధర రూ.819గా ఉంది. కలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్‌ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడంతో ధరలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top