ప్రేమికుడు సజీవ దహనం | Lover Is Burned Alive In Karnataka, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రేమికుడు సజీవ దహనం

Jul 14 2024 11:46 AM | Updated on Jul 14 2024 12:35 PM

lover is burned alive in karnataka

యువతి తండ్రి, సోదరులు అరెస్టు

శివమొగ్గ జిల్లాలో వీడిన మిస్టరీ

దొడ్డబళ్లాపురం: యువతిని ప్రేమించిన పాపానికి యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన శివమొగ్గ తాలూకా తొగర్సి గ్రామంలో చోటుచేసుకుంది. తొగర్సి సమీపంలోని అటవీ ప్రాంతంలో వీరేశ్‌ (27)హత్యకు గురయ్యాడు. హానగల్‌ పోలీసులు యువతి ఇద్దరు సోదరులను, తండ్రి, చిన్నాన్న, ముగ్గురు కార్మికులను అరెస్టు చేసారు. వివరాలు.. శిమొగ్గకు చెందిన వీరేశ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శివమొగ్గలో చదువుతున్న దూరపు బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ షికార్లకు వెళ్లేవారు.

యువతి ఫోటోలు వైరల్‌..
అయితే వీరి వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వీరేశ్‌ యువతితో సన్నిహితంగా ఉండగా తీసుకున్న ఫోటోలను యువతి బంధువుకు పంపించాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఏడుమంది కలిసి పెళ్లిపై మాట్లాడాలని అక్కి ఆలూరుకు పిలిపించుకున్నారు.

 అక్కడ ఒక షెడ్‌లో వీరేశ్‌ను కత్తులు, రాడ్లతో బాది హత్య చేసారు. వీరేశ్‌ తీసుకువచ్చిన ఇన్నోవా కారులోనే శవాన్ని తీసికెళ్లి తొగర్సి సమీపంలోని అటవీ ప్రాంతంలో కారుతోపాటు కాల్చివేసారు. మార్చ్‌ 16న తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. అప్పటినుంచి మృతుని ఆనవాలు దొరక్క కేసు మిస్టరీగా ఉండింది. దర్యాప్తు చేసిన పోలీసులు మొదట శవాన్ని గుర్తించి తరువాత ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement