‘‘అందుకే రాహుల్‌ గాంధీ ప్రధాని నివాసం వద్దకు వెళ్లారు’’ | Jitendra Singh Hits Back At Rahul Gandhi Over Amit Shah Firing Orders Remark In Lok Sabha, More Details Inside | Sakshi
Sakshi News home page

‘‘అందుకే రాహుల్‌ గాంధీ ప్రధాని నివాసం వద్దకు వెళ్లారు’’

Jul 29 2026 3:38 PM | Updated on Jul 29 2026 6:03 PM

Lok Sabha Union Minister Jitendra Singh key comments

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఆందోళనల మధ్యే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడారు. విపక్షాలపై జితేంద్ర సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై అమిత్‌ షా కాల్పులకు ఆర్డర్స్‌ ఇచ్చారంటూ రాహుల్‌ గాంధీ అనడం సరికాదని చెప్పారు.

"జూలై 21న ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బహుశా ఏదో ప్రత్యేక ఆలోచనతో వెళ్లి ప్రధానమంత్రి నివాసం బయట బైఠాయించారు. దేశం తనను ఎన్నుకుని 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో కూర్చోబెట్టాలనే బలమైన కోరిక ఆయనకు ఉన్నట్టు కనిపించింది. 

ఆ ఆకాంక్ష నెరవేరకపోవడంతో ఆయన నిరాశకు, అసహనానికి గురై 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ గేట్ల వద్ద కూర్చున్నారు. అలా చేయడం ఆయన స్థాయికి తగదని ఎంతో మర్యాదగా వివరించే ప్రయత్నం చేసినప్పుడు, తనను తీసుకెళ్లిపోవచ్చని ఆయన స్పందించారు

కాల్పులు జరగలేదని పదేపదే స్పష్టం చేశారు. టియర్ గ్యాస్ వాడారు. కాల్పులు జరగలేదు కాబట్టి ఆదేశాలు జారీ చేసే ప్రశ్నే తలెత్తదు. అలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం మంత్రికి కాదు, మేజిస్ట్రేట్‌కు ఉంటుంది.

ఇంత ముఖ్యమైన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సూచనలు ఇవ్వకుండా దానిపై రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వాడిన అసభ్య పార్లమెంటరీ భాష దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయనకు కనీస పార్లమెంటరీ నిబంధనలపై అవగాహన ఉన్నదా అన్న సందేహం కలుగుతోంది. ఈ దేశ భవిష్యత్తైన యువతను 'ఇడియట్స్' అని పిలవడం కన్నా దురదృష్టకరమైన విషయం ఇంకేముంటుంది?" అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement