‘కేరళంను లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ దోచుకున్నాయి’ | Kerala Assembly Elections 2026, PM Modi Slams Congress And Left In Kerala, Promises Action If BJP Wins | Sakshi
Sakshi News home page

‘కేరళంను లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ దోచుకున్నాయి’

Mar 29 2026 3:40 PM | Updated on Mar 30 2026 4:04 PM

 Keralam Assembly Elections Prime Minister Narendra Modi speech

పాలక్కాడ్: కేరళం ఎన్నికల వేళ ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌పై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ కేరళంలోని పాలక్కాడ్‌లో మోదీ పర్యటించి బహరంగ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేరళం ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు. కేరళంను లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ దోచుకున్నాయని చెప్పారు. ఓటు బ్యాంక్‌పైనే కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు దృష్టి పెట్టాయని తెలిపారు.

“బీజేపీకి వారు భయపడుతున్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు చేసిన అవినీతి బయటపడుతుందని వారు నమ్ముతున్నారు. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్-యూడీఎఫ్ ఇక్కడ భారీగా అవినీతికి పాల్పడ్డాయి. కానీ, ఈ పార్టీల ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అవినీతి కేసులను దర్యాప్తు చేసి కేరళం ప్రజలకు న్యాయం చేస్తుంది. 

అందుకే ఎల్డీఎఫ్-యూడీఎఫ్‌కు నిద్ర పట్టడం లేదు. కేరళంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్డీఏ లక్ష్యం కేరళం ప్రజల కలలను నెరవేర్చడం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే ఐదు రెట‍్ల ఎక్కువ బడ్జెట్‌ను కేరళానికి మేము ఇచ్చాం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరి బీ-టీమ్ అనే నిజం కేరళం ప్రజలకు తెలియాలి‘’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement