పాస్‌పోర్ట్‌ కవర్‌ ఆర్డర్‌ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది

Kerala Man Gets Passport While Orders Passport Cover From Amazon - Sakshi

కేరళ వ్యక్తికి షాకిచ్చిన అమెజాన్‌

ఒరిజినల్‌ పాస్‌పోర్ట్‌ డెలివరీ చేసిన వైనం

తిరువనంతపురం: ఇ-కామర్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగిన తర్వాత కొన్ని వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్‌లో మనం ఒకటి ఆర్డర్‌ చేస్తే.. డెలివరీ వచ్చాకా దానిలో మన ఆర్డర్‌కు సంబంధం లేని వేరే ఏదో వస్తువు వస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. విమ్‌ సబ్బులు వచ్చిన వార్త చదివాం. ఇప్పుడు వీటన్నింటిని తలదన్నే సంఘటన ఒకటి కేరళలో చోటు చేసుకుంది. 

ఓ వ్యక్తి పాస్‌పోర్ట్‌ కవర్‌ కోసం అమెజాన్‌లో ఆర్డర్‌ చేశాడు. డెలివరీ వచ్చాక అందులో ఉన్న దాన్ని చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా జడుసుకున్నంత పని చేశాడు. అంతలా భయపెట్టేది ఏముందబ్బా అంటే.. పాస్‌పోర్ట్‌ కవర్‌ కోసం ఆర్డర్‌ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆవివరాలు.. 
(చదవండి: చేయని తప్పునకు గల్ఫ్‌లో జైలు పాలై..)

కేరళ వయనాడుకు చెందిన మిథున్‌ బాబు అనే వ్యక్తి  2021, అక్టోబర్‌ 1న అమెజాన్‌లో పాస్‌పోర్ట్‌ కవర్‌ ఆర్డర్‌ చేశాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్‌ నవంబర్‌ 1న దాన్ని సదరు వ్యక్తి ఆర్డర్‌ని డెలివరీ చేశాడు. బాక్స్‌ ఒపెన్‌ చూసి చూడగా.. అతడికి అందులో పాస్‌పోర్ట్‌ కవర్‌తో పాటు ఒరిజనల్‌ పాస్‌పోర్ట్‌ కూడా కనిపించింది. అది చూసి అతడు షాక్‌ అయ్యాడు. ఇక ఆ పాస్‌పోర్ట్‌ కేరళ త్రిస్సూర్‌కు చెందిన మహ్మద్‌ సాలిహ్‌ అనే వ్యక్తికి సంబంధించింది. 
(చదవండి: ఓవైపు ఎల్‌ఎల్‌బీ చదువుకుంటూనే.. పరాటాలమ్మాయ్‌!!)

వెంటనే మిథున్‌ బాబు అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌కి కాల్‌ చేసి.. జరిగిన సంఘటన గురించి వివరించాడు. అంతా విన్న కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటీవ్‌ ముందు షాక్‌ అయ్యి.. ఆ తర్వాత భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చాడు. అయితే ఇక్కడ మిథున్‌ బాబుకు, నెటిజనులకు అర్థం కాని విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి ఒరిజనల్‌ పాస్‌పోర్ట్‌ అమెజాన్‌ కంపెనీ దగ్గరకు ఎలా చేరింది. దీనిపై అమెజాన్‌ కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. ప్రస్తుతం మిథున్‌ బాబు పాస్‌పోర్ట్‌ని ఒరిజనల్‌ ఓనర్‌కి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.

చదవండి: దుల్కర్ సల్మాన్ సినిమాను మించిన సీన్‌..5 ఏళ్లలో..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top