కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్య

Karni Sena President Sukhdev Singh Gogamedi Shot Dead In Jaipur - Sakshi

జైపూర్‌: జైపూర్‌లో దారుణం జరిగింది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన దుండగులు గోగమేడిని పిస్టల్‌తో కాల్చి చంపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో గోగమేడి తన ఇంటి వరండాలో కూర్చోగా ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఫేస్‌బుక్ పోస్ట్‌లో గోగమేడి హత్యకు తానే కారణమని పేర్కొన్నాడు. 
 
తీవ్రంగా గాయపడిన గోగమేడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గోగమేడితో పాటు ఉన్న అజిత్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చదవండి: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top