సిద్దూ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న డీకే | Karnataka Power Tussle Siddaramaiah And DK plans Live Updates | Sakshi
Sakshi News home page

సిద్దూ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న డీకే

May 28 2026 9:17 AM | Updated on May 28 2026 10:24 AM

Karnataka Power Tussle Siddaramaiah And DK plans Live Updates

కర్ణాటకలో నాయకత్వ మార్పునకు ఎట్టకేలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇలాంటి తరుణంలో కర్ణాటకలో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

కర్ణాటక సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో ఆసక్తికర దృశ్యాలు..

  • సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం ప్రకటన తర్వాత ఆసక్తికర పరిణామం
  • సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశ్వీరాదం తీసుకున్న డీకే.
  • డీకేను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న సిద్దరామయ్య. 

కాసేపట్లో మంత్రివర్గ సహచరులతో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌..

  • బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌
  • మధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా లేఖ పంపనున్న సిద్ధరామయ్య.
  • బెంగళూరులో అందుబాటులో లేని గవర్నర్‌ తావర్చంద్‌ గెహ్లాట్‌.
  • ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా గత రాత్రి ఇండోర్‌కు వెళ్లిన గెహ్లాట్‌.
  • గవర్నర్‌ అందుబాటులో లేకున్నా లోక్‌భవన్‌కు రాజీనామా లేఖ పంపనున్న సిద్దరామయ్య. 

 

 

సిద్దు ఇంటికి చేరుకున్న డీకే..

  • బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో భాగంగా డీకే శివకుమార్‌.. సిద్ధరామయ్య ఇంటికి చేరుకున్నారు.
  • మరోవైపు.. డీకే సీఎం అవుతున్నారనే వార్తలు.. జోష్‌లో ఆయన మద్దతుదారులు
  • స్వీట్‌ పంచుతూ డీకే అనుచరులు సందడి. 
     

కాసేపట్లో బ్రేక్‌ఫాస్‌ మీటింగ్‌.. 

  • నేడు కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

  • ఎల్లుండి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం

  • కాసేపట్లో మంత్రివర్గ సహచరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

  • హాజరుకానున్న డీకే శివకుమార్    

  • రాజ్యసభ సీటు నిరాకరించిన సిద్ధరామయ్య

  • మరో రెండేళ్లు ఎమ్మెల్యేగానే కొనసాగుతానని అధిష్టానానికి వెల్లడి

  • జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేసిన సిద్ధరామయ్య

  • మధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా సమర్పించనున్న సిద్ధరామయ్య

  • అధికారికంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని వెల్లడించిన ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ సూర్జేవాలా. 

రాజ్యసభకు సిద్ధూ నో

  • సీఎం పదవి నుంచి వైదొలుగనున్న నేపథ్యంలో సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ రాజ్యసభ సీటు ఆఫర్‌
  • ఎంపీగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనన్న సిద్ధరామయ్య
  • జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా.. మరో రెండేళ్లపాటు ఎమ్మెల్యేగానే కొనసాగాలని నిర్ణయం. 
     

Advertisement
 
Advertisement
Advertisement