కర్ణాటక: పరస్పర సమ్మతితో లైంగిక క్రియ నేరం కాదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడు, తనను ఓయో రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సాంప్రస్ ఆంథోనిపై బెంగళూరులోని ఓ ఠాణాలో కేసు దాఖలైంది. దీనిపై నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. తామిద్దరి మధ్య అంగీకారం ఉందని పేర్కొన్నాడు. విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న.. పరస్పర సమ్మతితో జరిగే లైంగిక క్రియ నేరం కాదని వ్యాఖ్యానించారు. సమ్మతితో ఆరంభమైన సంబంధం నిరాశతో అంతమైందని పేర్కొన్నారు. నిందితుడిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఆదేశించారు.


