మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..!

Karnataka Farmers Protest Electricity Crisis With Crocodile  - Sakshi

బెంగళూరు: కర్ణాటకాలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. కరెంటు కోతలు ఎక్కువవుతున్నాయని ఆరోపిస్తూ ఓ మొసలితో స్థానిక సబ్‌స్టేషన్‌కి వచ్చారు. కరెంటు ఇస్తారా..? మొసలిని వదలాలా..? అంటూ రోడ్లపైకి ఎక్కారు. కొల్హార తాలూకా రోణిహాల్‌ గ్రామానికి చెందిన రైతులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌ని బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ షేర్ చేశారు. ముందుంది ముసళ్ల పండగ అంటే ఇదేనేమో..? అంటూ రాసుకొచ్చారు. 

అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్‌ ఇవ్వడంతో పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని  రైతులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి మొసలి పిల్లలు, వన్యప్రాణులు వస్తున్నాయని తెలిపారు. రాత్రి పొలానికి వెళ్లిన సమయంలో దొరికిన మొసలిని ట్రాక్టర్‌లో సబ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత కార్యాలయం వద్దకు వచ్చిన అటవీశాఖ సిబ్బంది.. మొసలిని బంధించి సంరక్షణకేంద్రానికి తరలించారు.

ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top