Karnataka Oath Ceremony Updates: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే

Karnataka CM And Cabinet Swearing In Ceremony Live Updates In Telugu - Sakshi

Updates:

►కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేత  ప్రమాణ గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రొఫైల్‌
►ఓబీసీ నేత, 40 ఏళ్ల రాజకీయ జీవితం
►తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే,
►2013 నుంచి 18 వరకు సీఎం,
►13సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రికార్డ్‌.
►జేడీఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక

కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 
ప్రొఫైల్‌
► వక్కళిగ నేత, తల్లిదండ్రులు కెంపేగౌడ, గౌరమ్మ
►చదవు: మైసూరు యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌
►27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు
►సాతనౌర్‌ నుంచి మూడుసార్లు ఎమ్మల్యెఏ
►2008లో కనకపుర నుంచి గెలుపు
►2008, 2013, 2018లో హ్యాట్రిక్‌ విక్టరీ
►2014 నుంచి 18 వరకు విద్యుత్‌శాఖ మంత్రి
►2017 రాజ్యసభ ఎన్నికల్లోనూ కీలక పాత్ర
►దేశంలోనే ధనిక రాజకీయనేత
►కాంగ్రెస్‌ పార్టీలో ట్రబుల్‌షూటర్‌
►కేపీసీసీ అధ్యక్షుడు

కర్ణాటక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది నేతలు వీళ్లే

 కేజీ జార్జ్‌
ప్రొఫైల్‌
►సర్వగ్న నగర్‌ నియోజకవర్గం, క్రిస్టియన్‌ నేత, 5 సార్లు ఎమ్మెల్యే
►1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక
►హోం, పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలు

కేహెచ్‌ మునియప్ప
ప్రొఫైల్‌

► తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు, దేవనహళ్లి అసెంబ్లీ
►  చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజస్‌
► రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ శాఖల నిర్వహణ
► ఏడుసార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నిక
► కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం

జీ పరమేశ్వర
ప్రొఫైల్‌
►జననం 1951 ఆగస్టు 6, కొరటగెరె నియోజకవర్గం
►దళిత నేత, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే
►హోంశాఖ, సమాచారం, పౌర సంబంధాలు
►ఉన్నత విద్యాశాఖ మంత్రిగా విధులు
2010-18 వరకు కేపీసీసీ అధ్యక్షుడు
►వీరప్పమొయిలీ, ఎస్‌ఎం కృష్ణ, సిద్ధరామయ్య, కుమారస్వామి కేబినెట్‌లో మంత్రిగా విధులు
మాజీ డిప్యూటీ సీఎం, 

ఎంబీ పాటిల్‌
ప్రొఫైల్‌
►లింగాయత్‌ నేత, బబలేశ్వర్‌ నియోజకవర్గం.
►అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ
► ‍కర్ణాటక మాజీ హోం, జలవనరుల మంత్రి.

సతీశ్‌ జర్కిహోళి
ప్రొఫైల్‌
►ఎస్టీ నేత(వాల్మికీ నాయక)
► గోకక్‌ నియోజకవర్గం.
►నాలుగుసార్లు ఎమ్మెల్యే,
►రెండుసార్లు ఎమ్మెల్సీ,
►కేపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

ప్రియాంక్‌ ఖర్గే
ప్రొఫైల్‌
►దళిత నేత, ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే కుమారుడు
►చిత్తాపూర్‌ నియోజకవర్గం.
►మూడుసార్లు ఎమ్మెల్యే.
►ఐటీ, సాంఘీక సంక్షేమశాఖ మాజీ మంత్రి

జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌
►చామరజ్‌పేట్‌ నియోజకవర్గం
►మైనార్టీ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యే,
►జేడీఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిక
► మాజీ హజ్‌, వక్ఫ్‌ శాఖ మంత్రి

రామలింగారెడ్డి
►ఓబీసీ నేత
►బీటీఎమ్‌ లేఔట్‌ నియోజవకర్గం
►8సార్లు ఎమ్మెల్యే,
►మూడు సార్లు మంత్రిగా సేవలు.
►కర్ణాటక మాజీ హోంమంత్రి

►బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌, హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కమల్‌హాసన్‌, శవరాజ్‌ కుమార్‌ హాజరయ్యారు. 

►అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీష్‌ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్‌ మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న సీఎల్‌పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌లు కేబినెట్‌ కూర్పు, పోర్టుఫోలియోలపై పార్టీ పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. డీకే శివకుమార్‌ ప్రత్యేకంగా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌తోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేస్తారంటూ అధిష్టానం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సూర్జేవాలాలతో సిద్ధరామయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వీరి చర్చల్లో శివకుమార్‌ పాలుపంచుకున్నారు. నలుగురూ కలిసి జన్‌పథ్‌– 10లో ఉంటున్న రాహుల్‌ గాంధీని వెళ్లి కలిశారు.

కేబినెట్‌లోకి 20 మంది?
గంటన్నరకుపైగా వారి మధ్య చర్చలు నడిచాయి. ఆపై రాహుల్‌ గాంధీ, సూర్జేవాలా, వేణుగోపాల్‌లు పార్టీ చీఫ్‌ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్‌లోకి ఎందరిని తీసుకోవాలనే విషయమై తుది నిర్ణయానికి వచ్చారు. కేబినెట్‌లోకి తీసుకునే 20 మంది పేర్లను ఖారారు చేసినట్లు అనంతరం పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, వర్గాలకు సముచిత స్థానం దక్కేలా కేబినెట్‌ కూర్పు ఉంటుందన్నాయి. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేకు కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఆయనతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీష్‌ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

పలు రాష్ట్రాల సీఎంల రాక
ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. లక్ష మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని అంచనా. విస్తృతంగా బందోబస్తు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్‌ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా హాజరవుతారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ తనకు బదులుగా పార్టీ ప్రతినిధిని పంపుతారని సమాచారం.

కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను శుక్రవారం ఉదయం డీకే శివకుమార్‌ స్వయంగా పరిశీలించారు. ప్రజా ప్రతినిధులైన జేడీఎస్, బీజేపీ నేతలను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శివకుమార్‌ చెప్పారు. శనివారమే జరిగే కేబినెట్‌ మొదటి భేటీలో కాంగ్రెస్‌ ప్రధాన హామీ అయిన 5 గ్యారంటీల అమలుపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు.  
చదవండి: ఢిల్లీకి నేతల క్యూ.. రాష్ట్ర నేతలతో వేర్వేరుగా అమిత్‌షా, సునీల్‌ బన్సల్‌ భేటీ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top