నేడు సోమ్‌నాథ్‌ ఆలయంపై ఎయిర్‌ షో | Indian Air Force perform special air show above Somnath Temple | Sakshi
Sakshi News home page

నేడు సోమ్‌నాథ్‌ ఆలయంపై ఎయిర్‌ షో

May 11 2026 6:28 AM | Updated on May 11 2026 6:28 AM

Indian Air Force perform special air show above Somnath Temple

గిర్‌ సోమ్‌నాథ్‌: గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయంపై భారత వైమానిక దళం సోమవారం సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీం ఎయిర్‌ షో చేపట్టనుంది. 15 నిమిషాలపాటు కొనసాగే ఈ షోలో ఎంకే–132 విమానాలతో పైలట్లు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను ప్రదర్శిస్తారు. 

గగనతలంలో కాషాయం, తెలుపు, పచ్చని రంగులతో కూడిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. చేతక్‌ హెలికాప్టర్‌తో ఆలయంపై పూలవాన కురిపిస్తారు. సోమ్‌నాథ్‌ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ ఉత్సవాలకు సోమవారం ప్రధాని మోదీ హాజరు కానున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement