ట్రంప్‌ వ్యాఖ్యలను అభినందించిన మోదీ | PM Modi Reacts On Donald Trump India-US Ties Comments | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వ్యాఖ్యలను అభినందించిన మోదీ

Sep 6 2025 10:22 AM | Updated on Sep 6 2025 10:56 AM

PM Modi Reacts On Donald Trump India-US Ties Comments

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ న్యూస్‌ఏజెన్సీ ప్రచురించిన కథనంపై మోదీ తన ఎక్స్‌ ఖాతా నుంచి స్పందించడం గమనార్హం. 

తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్‌, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారాయన. 

అంతకు ముందు.. భారత్‌, రష్యాలు అమెరికాకు దూరం అవుతున్నట్లు అనిపిస్తోందంటూ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిగంటలకే ఆయన ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. భారత్‌తో తిరిగి సంబంధాలు మెరుగుపడతాయా? అని రిపోర్టర్ల నుంచి ఎదురైన ప్రశ్నకు ట్రంప్‌ బదులిస్తూ.. ‘‘భారత్‌, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయి. నేను ఎప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటాను. మోదీ గొప్ప ప్రధాని. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చలేదు’’ అన్నారు. 

ఈ నేపథ్యంలో ఐరాస కీలక సమావేశానికి మోదీ గైర్జారు అవుతారనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో ట్రంప్‌ వైఖరికి నిరసనగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తుండగా.. మోదీ తాజా ట్వీట్‌తో ఇరు దేశాధినేతల మధ్య గ్యాప్‌ ఏర్పడిందన్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడినట్లయ్యింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement