
9.7 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరిన సంస్థ యూఏవీ
నూతన ప్రపంచ రికార్డ్ నమోదయ్యే చాన్స్
లక్నో: భారతీయ విద్యార్థుల అంతరిక్ష పరిశోధనా సంస్థగా మొదలైన కలామ్ ల్యాబ్స్ తాజాగా దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తుకు ఎగరగలిగే మానవ రహిత లోహవిహంగం(యూఏవీ)ని తయారుచేసి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ యూఏవీ తాజాగా సముద్రమట్టానికి 9,790 మీటర్ల ఎత్తుకు చేరుకుని కొత్త ప్రపంచ రికార్డ్‌ను సృష్టించింది. రెక్కల వెడల్పు రెండు మీటర్లలోపు ఉన్న ఒక యూఏవీ ఇంతటి ఎత్తుకు ఎగరడం ఇదే తొలిసారి. అయితే ఈ రికార్డ్‌ను ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
వైమానికరంగంలో యువత ఘనతను చాటే ఉద్దేశ్యంతో అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులుండే హిమాల యాల్లో ఈ యూఏవీని ఎగరేయడం విశేషం. సము ద్రమట్టానికి 2,700 మీటర్ల ఎత్తులోని హిమాల యాల్లో దీనిని పరీక్షించారు. వైమానికరంగంలో చిన్నారులను ప్రోత్సహించాలనే లక్ష్యంగా ముగ్గురు బిట్స్ పిలానీ పూర్వవిద్యార్థులు ఈ కలామ్ ల్యాబ్స్ అంకుర సంస్థను స్థాపించారు. వాస్తవ ప్రపంచ సవాళ్లకు స్వయంగా విద్యార్థులే పరిష్కారాలు వెతకగలరని నిరూపించేందుకు ఈ సంస్థను ఏర్పాటుచేశామని వ్యవస్థాపకులు చెప్పారు.
20 నుంచి మైనస్ 60 దాకా
గాలి పీడనం ఎక్కువగా ఉండే వాతావరణంతోపాటు గాలిపీడనం తక్కువగా ఉండే పరిస్థితుల్లోనూ తమ యూఏవీ ఎగరగలదని నిరూపించేందుకు దీనిని + 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశం నుంచి నింగిలోకి ఎగిరేశారు. గరిష్టంగా అది మైనస్ 60 డిగ్రీ సెల్సియస్ పరిస్థితుల్లోనూ ఆకాశంలో చక్కర్లు కొట్టడం విశేషం. అత్యంత ఎత్తులకు వెళ్లేకొలదీ గాలి పీడనం తగ్గి యూఏవీ గాల్లోనే స్థిరంగా ఉండటం కష్టమవుతుంది.
గాలి కేవలం గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నా సరే ఈ యూఏవీ గాల్లో స్థిరత్వాన్ని సాధించడం గమనార్హం. దీని బరువు నాలుగు కేజీలలోపే. అత్యంత ఎత్తులో ఎగిరే, తక్కువ బరువైన డ్రోన్ల తయారీలో భారత్ స్వావలంభన దిశలో ఇలాంటి యూఏవీలు బాటలు వేయనున్నాయి. కంట్రోలర్ అవసరం లేకుండా స్వయంచాలితం(అటానమస్) గా ఈ యూఏవీ అంత ఎత్తులకు వెళ్లిరావడం విశేషం. ‘‘ భారత్‌లో నూతన ఆవిష్కరణలు ఎంతటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేస్తాయనడానికి ఈ యూఏవీనే గీటురాయి’’ అని కలామ్ ల్యాబ్స్ ప్రధాన ఇంజనీర్ డాక్టర్ ప్రియా శర్మ చెప్పారు.
వాతావరణ పీడనం 73 శాతం తగ్గిపోయినాసరే అటానమస్‌గా యూఏవీ పూర్తి సామర్థ్యంతో ఎగిరిందని ప్రియ వెల్లడించారు. స్ట్రాటోస్పియర్ ఆవరణ సమీపందాకా యూఏవీ వెళ్లివచ్చింది. మైనస్ 60 డిగ్రీ సెల్సియస్‌నూ ఇది తట్టుకుంది. అత్యంత తేలికైన వస్తువులు, తక్కువ ఇంధనాన్ని వాడుకునే ప్రొప ల్షన్, అధునాతన థర్మల్ వ్యవస్థల కారణంగానే యూఏవీ ప్రయోగం విజయవంతమైందిన ప్రియ చెప్పారు. మరో ఐదేళ్లలో భారత డ్రోన్ పరిశ్రమ 23 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతున్న ఈ తరుణంలో డ్రోన్ల రంగంలో నూతన ఆవిష్కరణల ఆవిశ్యత ఎంతైనా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.