బాలాకోట్‌ హీరో అభినందన్‌కు గ్రూప్‌ కెప్టెన్‌ ర్యాంక్‌

IAF promotes Balakot air strike hero Abhinandan to Group Captain rank - Sakshi

న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధవిమానాన్ని కూల్చిన భారత వాయుసేన పైలట్, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు ‘గ్రూప్‌ కెప్టెన్‌’ ర్యాంక్‌ దక్కనుంది. సంబంధిత ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యాక ఆయనకు ఆ ర్యాంక్‌ ఇవ్వాలని భారత వాయుసేన నిర్ణయించిందని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదుల శిక్షణ శిబిరంపై భారత వాయుసేన విమానాలు మెరుపుదాడి చేసిన సంగతి తెల్సిందే.

ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 2019 ఫిబ్రవరి 27న భారత దాడి తర్వాతి రోజునే పాకిస్తాన్‌ తన వాయుసేన దళాలను ప్రతిదాడి కోసం భారత్‌ వైపునకు పంపింది. వీటిని తిప్పికొట్టేందుకు భారత వాయుసేన బలగాలు గగనతలంలో ముందుకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ తాను నడుపుతున్న మిగ్‌–21 బైసాన్‌ వాయుసేన యుద్ధవిమానంతో పాక్‌ ఎఫ్‌–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు.  

చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top