
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్‌ఆర్‌పుర పోలీసుస్టేషన్‌లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్‌ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.