రెయిలింగ్‌ను ఢీకొని బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి! | Sakshi
Sakshi News home page

Gujarat: రెయిలింగ్‌ను ఢీకొని బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి!

Published Sat, Feb 24 2024 7:52 AM

Gujarat Bus Accident Ahmedabad Vadodara Expressway - Sakshi

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు రోడ్డుపైనున్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందనున్న ప్రదేశంలో పడిపోయింది. ఈ ‍ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఈ ఘటన ఖేడా జిల్లాలోని నడియాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎస్పీ సహా పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. 

ఎస్పీ రాజేష్ గధియా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్ నుంచి పూణె వెళుతోందని తెలిపారు. బస్సులో దాదాపు 23 మంది ప్రయాణికులు ఉన్నారు. హైవేపై అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement