ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Published Wed, Apr 17 2024 6:56 PM

Car Rams Truck On Ahmedabad Vadodara Expressway, 10 Died - Sakshi

గాంధీనగర్‌ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై నిలిపి ఉంచిన ట్రక్కుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. ఖేడా జిల్లాలోని నదియాడ్ పట్టణం సమీపంలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. 

అతివేగం కారణంగా మారుతీ సుజుకి ఎర్టిగా కారు అదుపుతప్పి ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. బాధితులు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 93 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
చదవండి: ‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement