
పనాజీ: గోవాలో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి అలెక్సియో సికెరియా(Aleixo Sequeira) బుధవారం రాజీనామా చేశారు. మాజీ మంత్రి దిగంబర్ కామత్‌ను మళ్లీ మంత్రివర్గంలో చేర్చుకొనే అవకాశం కనిపిస్తోంది.
అలాగే అసెంబ్లీ స్పీకర్ రమేశ్ తవాడ్కర్‌కు కూడా మంత్రిపదవి కట్టబెట్టే పరిస్థితి ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేశానని అలెక్సియో సికెరియా చెప్పారు.