గాంధీ జయంతి రోజు స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ | Sakshi
Sakshi News home page

Gandhi Jayanti and the 4th anniversary of Swachh Bharat Abhiyan:స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Published Sat, Oct 2 2021 9:41 PM

Gandhi Jayanti and the 4th anniversary of Swachh Bharat Abhiyan  Jacqueline Fernandez goes beach cleaning  As Gandhi Jayanti And  Swachh Bharat Abhiyan  - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గాంధీ జయంతి తోపాటు స్వచ్ఛ భారత్‌ అభియన్‌ 4వ వార్షికత్సవం సందర్భంగా బీచ్‌ క్లినింగ్‌ మిషన్‌ కార్యక్రమాలు చేపట్టింది.  ఆమెకు సంబంధించిన యోలో ఫౌండేషన్‌ సాయంతో మిథి నది ఒడ్డున శుభ్రపరచడమే కాకా తాను చేసిన స్వచ్ఛ కార్యక్రమాల ఫోటోలతో పాటు మీరు కూడా ఈ విధంగా చేయండి అంటూ  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఒకే రోజు రెండు ప్రత్యేకతలు సంతరించుకున్న రోజున ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలతోనే వారికి నివాళులర్పించాలంటూ  నటి ఫెర్నాండ్‌జ్‌ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

(చదవండి: ఎయిర్‌ అంబులెన్స్‌ కూలి నలుగురు మృతి)

అంతేకాదు ఇన్‌స్టాగ్రాంలో మాట్లాడుతూ......"ఆమె ఈ రోజు నావంతు పని నేను స్వచ్ఛందంగా చేశాను, అలాగే మీరు మీ వంతు భాగస్వామ్యంకండి. ఈ బీచ్‌ క్లీన్‌ క్యాంప్‌లనూ సేవా సంస్థలు ఎల్లప్పుడూ నిర్వహిస్తారు. అందులో మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గోండి. ఇప్పుడూ అందరం మన నగరాన్ని, మన దేశాన్ని మన మాతృభూమిని పరిశుభ్రంగా ఉంచుకుంటాం అని ప్రతిజ్ఞ చేయండి " అంటూ పిలుపు నిచ్చింది.

(చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది)

Advertisement
 
Advertisement
 
Advertisement