Sakshi News home page

Mumbai: అటల్‌ సేతుపై మొదటి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

Published Mon, Jan 22 2024 8:09 AM

First Accident On Mumbai New Atal Setu Viral Video - Sakshi

ముంబై: ముంబైలో కొత్త నిర్మించిన అటల్‌ సేతు వంతెనపై మొదటి ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న ఓ కారు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో సినిమా రేంజ్‌లో పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ముంబైలోని అటల్‌ సేతు వంతెనపై మొదటి ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న మరో కారును ఓవర్‌ టేక్‌ చేయబోయి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సినిమా రేంజ్‌లో రెండు పల్టీలు కొట్టింది. అయితే, వంతెనపై మరో కారులో ఉన్న డ్యాష్‌క్యామ్‌లో ఇదంతా రికార్డు అయ్యింది. కాగా, ఈ ప్రమాదంలో కారును ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ప్రమాదానికి గురైన వారు రాయ్‌గఢ్‌లోని చిర్లేకు వెళ్తున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. ముంబైలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్‌ సేతు’ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్‌ లింక్‌ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కాగా అటల్‌ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు. ఇది ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్‌ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement