ప్రముఖ ఉర్దూ కవి కన్నుమూత : ప్రముఖుల నివాళి! | Famous Urdu poet Bashir Badr dies in Bhopal | Sakshi
Sakshi News home page

ప్రముఖ ఉర్దూ కవి కన్నుమూత : ప్రముఖుల నివాళి!

May 28 2026 5:21 PM | Updated on May 28 2026 5:36 PM

Famous Urdu poet Bashir Badr dies in Bhopal

Bashir Badr Passed Away ప్రముఖ ఉర్దూ కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బషీర్ బద్ర (91)ఇకలేరు.  సుదీర్ఘ అనారోగ్యం, డిమెన్షియా (మతిమరుపు) సమస్యలతో పోరాడుతూ   ఈ రోజు (మే 28న) భోపాల్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణవార్తను ఆయన కుమారుడు నుస్రత్ బద్ర ధృవీకరించారు. ఆయనకు భార్య రాహత్ బద్ర, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

"బషీర్ సాహబ్ మనల్ని విడిచి వెళ్లిపోయారు...ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి"  అంటూ ఆయన భార్య రాహత్ బద్ర్ సోషల్ మీడియా ద్వారా  భర్త మరణం గురించి వెల్లడించారు.  కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ఆయన గతంలో కవి సమ్మేళనాలు (ముషాయిరాలు) నిర్వహించే తన గదిలోనే చివరి శ్వాస విడిచారు. బషీర్ బద్ర్ 1935, ఫిబ్రవరి 15 న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించారు. ఇటావా, అలీగఢ్‌లలో విద్యనభ్యసించారు. మీరట్‌లో కొన్నాళ్లు సేవలు అందించిన అనంతరం, చివరకు భోపాల్‌లోని ఫతేగఢ్ ప్రాంతంలో ఉన్న 'బషీర్ మంజిల్'లో స్థిరపడ్డారు. కేవలం ఏడేళ్ల వయసులోనే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించి దిగ్గజ కవిగా ఎదిగారు.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU) నుండి బ్యాచిలర్స్ , డాక్టరేట్ డిగ్రీలను పొందారు. అక్కడే చాలా సంవత్సరాలు ఉర్దూ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మీరట్ కాలేజీలో 17 ఏళ్ల పాటు ఉర్దూ విభాగాధిపతిగా (HOD) సేవలందించారు. బషీర్ బద్ర్ తన పీజీ పూర్తి చేయకముందే ఆయన రాసిన ప్రారంభ కవితలను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సిలబస్‌లో చేర్చడం విశేషం.

y"> ఆయన ఆధునిక ఉర్దూ కవిత్వానికి (Modern Urdu poetry) ఎనలేని సేవ చేశారు.  దాదాపు 10,000 ఉర్దూ కవితలను రాశారు. గజల్స్‌కు సంబంధించి 7 సంకలనాలను (Collections) ప్రచురించారు. సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1989లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో సత్కరించింది. అదే సంవత్సరంలో ఆయన రాసిన 'ఆస్' (Aas) అనే కవితా సంకలనానికి ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.


సాధారణ ప్రజలకు అర్థమయ్యే సరళమైన, వాడుక భాషలో ఉర్దూ గజల్స్ రాయడం బషీర్ బద్ర శైలి. భాషా భేదాలను తొలగించడానికి ఆయన తన గజల్స్‌ను దేవనాగరి (హిందీ) లిపిలో కూడా ప్రచురించారు. ఆయన రాసిన కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన పంక్తులు:

  •    "ఉజాలే అప్నీ యాదోన్ కే హమారే సాత్ రెహ్నే దో, నా జానే కిస్ గలీ మే జిందగీ కీ శామ్ హో జాయే." (నీ జ్ఞాపకాల వెలుగులను నాతోనే ఉండనివ్వు, జీవితపు సాయంత్రం ఏ వీధిలో వస్తుందో ఎవరికి తెలుసు)
  •  "కుచ్ తో మజ్బూరియాన్ రహీ హోంగీ, యూన్ హీ కోయి బేవఫా నహీ హోతా." (ఏదో ఒక బలవంతపు పరిస్థితి ఉండే ఉంటుంది, ఎవరూ ఊరికే నమ్మకద్రోహం చేయరు)
  •   "లోగ్ టూట్ జాతే హై ఏక్ ఘర్ బనానే మే, తుమ్ తరస్ నహీ ఖాతే బస్తీయాన్ జలానే మే." (ఒక ఇల్లు కట్టుకోవడానికి మనుషులు విరిగిపోతారు, కానీ మీరు బస్తీలను తగలబెట్టడానికి ఏమాత్రం జాలి చూపరు)
     

 విషాదం : అనేక కవితలు, పత్రాలు కాలిపోయాయి
1987లో మీరట్ వర్గీయుల ఘర్షణల్లో ఆయన ఇల్లు తగలబడిపోయింది. ఆయన జీవితకాల శ్రమ అయిన అనేక ప్రచురించని కవితలు, పత్రాలు అందులో బూడిదయ్యాయి. ఈ తీవ్ర నష్టం తర్వాత ఆయన భోపాల్‌కు వలస వెళ్లి తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు.

ప్రముఖుల సంతాపం
ఆయన మృతి పట్ల సాహిత్య లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్   అత్యంత మధురమైన కవి మనల్ని వీడిపోయారు. ఉర్దూ భాషకు ఆయన లేని లోటు తీరనిది అంటూ సంతాపం తెలిపారు. ప్రముఖ కవి అంజుమ్ బారాబంక్వి స్పందిస్తూ.. "మొత్తం ప్రపంచంలోనే 'నయీ గజల్' ఉద్యమానికి చెందిన అత్యంత గొప్ప కవిని  మనం కోల్పోయాము" అని నివాళులర్పించారు.

ఇదీ చదవండి: ఈ వెహికల్‌ తెచ్చిన లక్‌ : నెలకు రూ. 45 వేల

Advertisement
 
Advertisement
Advertisement