Kargil Vijay Diwas: 4 రోజులు.. 160 కి.మీ.లు | Ex-army officer runs 160 km to mark Kargil Vijay Diwas | Sakshi
Sakshi News home page

Kargil Vijay Diwas: 4 రోజులు.. 160 కి.మీ.లు

Jul 26 2024 4:53 AM | Updated on Jul 26 2024 4:53 AM

Ex-army officer runs 160 km to mark Kargil Vijay Diwas

ముంబై: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ మాజీ అధికారిణి సాహసోపేతమైన ఫీట్‌ చేశారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ వర్షారాయ్‌ 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. రన్‌ జూలై 19న ప్రారంభమై జూలై 22న ముగిసింది. 

శ్రీనగర్‌ నుండి ద్రాస్‌ సెక్టార్‌లోని కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌ వరకు ఆమె సగటున రోజుకు 40 కి.మీ. పరుగెత్తారు. పరుగు పూర్తయిన సందర్భంగా కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అరి్పంచారు.  ఆమెతో పాటు చినార్‌ వారియర్స్‌ మారథాన్‌ జట్టు కూడా ఉంది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ వర్షా రాయ్‌ భర్త కశ్మీర్‌లో ఆర్మీ అధికారిగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement