బాహుబలి ఏనుగు అంటే ఇలా ఉంటది.. వరదలో మూడు కిలోమీటర్లు ఈది..

Elephant And Mahout Cross Swollen Ganga River - Sakshi

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల ప్రజలు చిక్కుకుని గల్లంతైన ఘటనలు చూశాము. తాజాగా మరో ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 

బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్‌పూర్‌లో భారీ వర్షాల కారణంగా గంగా నది ఉప్పొంగింది. కాగా, వరద నీటి ప్రవాహంలో ఓ ఏనుగు మూడు కిలోమీటర్లు ఈదిన ఘటన సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక్కడే ట్విస్టు ఏంటంటే.. పీకల్లోతు మునిగిన ఆ ఏనుగుపై మావటివాడు కూడా ఉండటమే. అయితే, ఏనుగుతో సహా మావటివాడు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద కారణంగా గంగా నదిలో కొంత దూరం కొట్టుకుపోయారు.

ఈ క్రమంలో తల వరకు మునిగిన ఆ ఏనుగు నదిలో ఎన్నో కష్టాలకు ఓడ్చి.. సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది. చివరకు ఒక చోట నది మలుపులో కొందరు వ్యక్తులు ఉండటాన్ని మావటివాడు చూసి.. ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌  మారింది. స్పందించిన నెటిజన్లు ఏనుగు ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రాణాలు కాపాడుకునే యత్నం.. కాపాడమని కేకలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top