అహ్మద్‌ పటేల్‌ అల్లుడి ఆస్తులు సీజ్‌ | ED Attaches Assets Of Ahmed Patels Son-in-law | Sakshi
Sakshi News home page

అహ్మద్‌ పటేల్‌ అల్లుడి ఆస్తులు సీజ్‌

Jul 3 2021 1:39 AM | Updated on Jul 3 2021 1:39 AM

ED Attaches Assets Of Ahmed Patels Son-in-law - Sakshi

న్యూఢిల్లీ: నగదు అక్రమ చెలామణీ కేసులో దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ అల్లుడు ఇర్ఫాన్‌ అహ్మద్‌ సిద్దిఖీ , నటులు డీనో మోరియా, సంజయ్‌ ఖాన్, డీజే అఖ్వీల్‌లకు చెందిన పలు ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం తెలిపింది. సంజయ్‌ ఖాన్‌కు చెందిన రూ. 3 కోట్లు, డీనో మోరియాకు చెందిన రూ. 1.4 కోట్లు, డీజే అఖ్వీల్‌కు చెందిన రూ. 1.98 కోట్లు, సిద్దిఖీకి చెందిన రూ. 2.41 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌ ప్రధాన ప్రమోటర్లైన, ప్రస్తుతం పరారీలో ఉన్న నితిన్‌ సందేసర, చేతన్‌ సందేసర కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement