నదిలో రీల్స్ చేస్తున్న సమయంలో ఢిల్లీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు నదిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరగా.. రాజకీయంగానూ సెటైర్లు పేలుతున్నాయి.
ఢిల్లీ పట్‌పర్గంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ నేగి(Ravi Negi) యుమునా నది నీటిలో జారిపడిపోయారు. నది శుభ్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా రీల్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. అదృవశాత్తూ ఆయనకేం కాలేదు. చట్ పూజ వేళ యుమునా నది కాలుష్యంపై రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సెటైర్లు సంధిస్తోంది. బీజేపీ నేతలకు ఉత్త హామీలివ్వడం పనిగా మారింది. బహుశా ఆ అబద్ధపు రాజకీయాలకు విసిగిపోయిన యమునమ్మే ఇలా చేసిందేమో అంటూ ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా వ్యాఖ్యానించారు.
యమునా నది పరిశుభ్రంగా ఉందంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. అయితే.. అంత శుభ్రంగా ఉంటే ఆ నది నీటిని తాగాలంటూ ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ సవాల్ విసిరారు. అంతేకాదు.. బాటిల్ నీటితో సీఎం నివాసానికి చేరి నిరసన చేపట్టారు. ఈ ఆరోపణలు, కౌంటర్‌లు కొనసాగుతున్న వేళ.. యమునా నీరు శుభ్రమైందని నిరూపించే క్రమంలోనే ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ ఇలా నీళ్లలో పడిపోయారు.
BJP MLA Ravi Negi accidentally fell into the Yamuna River in Delhi while shooting a social media reel about river cleaning. The moment, captured on camera, quickly went viral online, sparking amusement across social media platforms. The clip shows Negi slipping and plunging into… pic.twitter.com/PPWRFdfjK6
— Mid Day (@mid_day) October 27, 2025


