భార్య లేని లోకంలో ఉండలేనని..  | Couple Deceased In Karnataka | Sakshi
Sakshi News home page

భార్య లేని లోకంలో ఉండలేనని.. 

Mar 5 2021 6:47 AM | Updated on Mar 5 2021 9:33 AM

Couple Deceased In Karnataka - Sakshi

భార్య లేని జీవితం వ్యర్థమని కుమిలిపోయిన సిద్ధప్పాజీనాయక్‌ ఆమె అంత్యక్రియల సమయంలో పురుగుమందు బిళ్లలు వేసుకున్నాడు. స్పృహ తప్పిపడిపోయిన అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

మైసూరు: భార్య మరణాన్ని భరించలేక భర్త ఆమె అంత్యక్రియల సమయంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు జిల్లా హుణసోరు తాలూకా హోస రామనహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సిద్ధప్పాజీ నాయక్‌ (37), అనితా(30) దంపతులు. వీరికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న సంసారం. అయితే బుధవారం రాత్రి దంపతుల మధ్య ఏదో గొడవ జరగడంతో అనిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించింది. భార్య లేని జీవితం వ్యర్థమని కుమిలిపోయిన సిద్ధప్పాజీనాయక్‌ ఆమె అంత్యక్రియల సమయంలో పురుగుమందు బిళ్లలు వేసుకున్నాడు. స్పృహ తప్పిపడిపోయిన అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులు భార్యకు అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలోనే భర్త అంత్యక్రియలు కూడా జరిపారు.  

ప్రియురాలిని చంపిన ప్రియుడు అరెస్టు 
నీ జీతం నాకే ఇవ్వాలి. నువ్వు నాతోనే ఉండాలి అని ఒక వివాహిత  ప్రియున్ని ఒత్తిడి చేయడంతో అతడు ఆమెను హత్య చేశాడు. మైసూరు ఐటీసీ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తున్న పల్లవికి, అదే కంపెనీలో డ్రైవర్‌గా పనిచేసే రవిచంద్రతో వివాహేతర సంబంధం ఉంది. పల్లవికి ముగ్గురు పిల్లలు కాగా, రవిచంద్రకు ఇంకా పెళ్లి కాలేదు. రవిచంద్ర జీతం కూడా తనకే ఇవ్వాలని, ఎవరినీ పెళ్లి చేసుకోవద్దని అతడిపై పల్లవి ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఆమె ఒత్తిడిని తాళలేక గత నెల 23న హిమ్మావు గ్రామం వద్ద నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బాది దారుణంగా హత్య చేశాడు. పోలీసులు విచారించి రవిచంద్రను గురువారం అరెస్టు చేశారు.
చదవండి:
రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?     
శశికళ నిష్క్రమణ వెనుక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement