కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య | Constable wife commits suicide | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య

May 25 2026 1:56 PM | Updated on May 25 2026 2:48 PM

Constable wife commits suicide

కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని మహాదేవపుర నియోజకవర్గం హెచ్‌ఏఎల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజేష్‌ ఆరాధ్య భార్య లక్ష్మీప్రియ (26) శుక్రవారం కృష్ణరాజపురలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాజేష్‌ ఆరాధ్య–లక్ష్మీప్రియల వివాహం 2023లో జరిగింది.

 రాజేష్‌ ఆరాధ్య, అతని తండ్రి పాలక్ష రాధ్య, తల్లి భాగ్యమ్మ తమ కుమార్తెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని లక్ష్మీప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మీ ప్రియ వాట్సాప్‌ ద్వారా తన సోదరి జయశ్రీకి ఫోన్‌ చేయగా ఆమె కాల్‌ స్వీకరించలేదు. ఆ తర్వాత రాజేష్‌ ఆరాధ్య ఆమెకు ఫోన్‌ చేసి లక్ష్మీ ప్రియ మరణించినట్లు తెలియజేశాడు. లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement