స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు

Congress Says Adani NDTV Stake Is Aimed Stifling Independent Media - Sakshi

ఎన్డీటీవీలో అదానీ గ్రూపు షేర్ల కొనుగోలుపై కాంగ్రెస్‌ ఆందోళన  

న్యూఢిల్లీ: దేశంలో స్వతంత్ర మీడియాని అణచివేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రముఖ మీడియా కంపెనీ న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీటీవీ)ను పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ బలవంతపు కొనుగోలుపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రధాని మోదీ ‘‘ఖాస్‌ దోస్త్‌’’ (ఆప్త మిత్రుడు) స్వతంత్ర మీడియాని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకులు జైరామ్‌ రమేష్, కపిల్‌ సిబల్‌ ఈ కొనుగోలు వ్యవహారాన్ని తప్పు పట్టారు.

‘అదానీ గ్రూప్‌ ఎన్‌డీటీవీని బలవంతంగా కొనుగోలు చేయడం అంటే వారి రాజకీయ, ఆర్థిక అధికారాలను కేంద్రీకరించుకోవడం, స్వతంత్ర మీడియా గొంతు అణిచివేయడమే’ అని జైరామ్‌ దుయ్యబట్టారు. స్వతంత్ర జర్నలిజంను పారిశ్రామికవేత్తలు తమ గుప్పిట్లోకి తీసుకోవడం ఆందోళనకరమని సిబల్‌ అన్నారు. ఎన్‌డీటీవీ షేర్లు 29.18% ఇప్పటికే పరోక్ష పద్ధతిలో దక్కించుకున్న అదానీ గ్రూపు అదనంగా మరో 26% కొనుగోలు చేయడానికి ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వడంతో ఈ విషయం బయటకి వచ్చింది.

ఇదీ చదవండి: మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top