Agnipath Protests: అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం

Central Government Alert On Agneepath Scheme Protest - Sakshi

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు భద్రతను పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్‌ వల్ల యువతకు ప్రయోజనమని తెలిపారు.

అగ్నిపథ్‌ను అర్థం చేసుకోవాలి
అగ్నిపథ్‌ ఆందోళనపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే  ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
సంబంధిత వార్త: Army Students Protests Live Updates: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఘటనపై ఉన్నతాధికారులతో రైల్వే జీఎం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఆస్తి నష్టం, ప్రయాణికుల ప్రత్యామ్నాయం తరలింపుపై అధికారులతో చర్చించారు. కాగా ఆందోళనకారులతో 3 రైలు(అజంతా, ఈస్ట్‌కోస్ట్‌, ఎమ్‌ఎమ్‌టీఎస్‌)  ధ్వంసమయ్యాయని  దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. పార్సిల్ రైల్‌తోపాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో రెండు బోగీలు దగ్దమయ్యాయని తెలిపారు. 40 ద్విచక్రవాహనాలు కూడా ద్వంసం అయ్యాయని పేర్కొన్నారు. రైళ్ల రద్దు పైన కాసేపట్లో ప్రకటన చేస్తామని అన్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top