సెలవు కావాలని వైరల్‌ లేఖ

CCB Constable Wrote Letter To Give Leave To Watch Movie Goes Viral  - Sakshi

యశవంతపుర: సినిమా చూడడానికి సెలవు ఇవ్వాలని సీసీబీ కానిస్టేబుల్‌ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ రాయగా సెలవు మంజూరైంది. జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆనంద భార్యతో కలిసి సినిమా చూడాలని అనుకున్నాడు. ఇందుకోసం లేఖ రాసి సోషల్‌ మీడియాలో ఉంచాడు. దీంతో అది వైరల్‌ అయ్యింది.  

ఆరుగురికి గౌరవ డాక్టరేట్లు
బుధవారం జరిగిన గుల్బర్గా వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ గెహ్లాట్‌ ఆరుమందికి గౌరవ డాక్టరేట్లను అందజేశారు. సిద్ధరామ శరణ, డాక్టర్‌ బసవరాజ పాటిల్‌ అట్టూర, వేణుగోపాల హేరూరు, గురమ్మ, అబ్దుల్లా కున్హి, రాధాకృష్ణ దేసిరాజులకు బహూకరించారు. ఈ సందర్భంగా పీజీ పట్టభద్రులకు పట్టాలు, ప్రతిభావంతులకు బంగారు పతకాలను అందజేశారు. చారిత్రక కోటను గవర్నర్‌ సందర్శించారు.  

(చదవండి: రోడ్డుపై అంకుల్‌ స్టెప్పులు.. మధ్యలో ట్రాఫిక్‌ పోలీస్‌ వచ్చి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top