
కర్ణాటక: ప్రయాణికున్ని బీఎంటీసీ కండక్టర్ చెంపమీద కొట్టినట్లు బాధితుడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియో పోస్టు చేశాడు. వివరాలు.. దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్‌కి వెళ్తున్న బీఎంటీసీ బస్సులో ఓ యువకుడు టికెట్ ఇవ్వాలని అడిగాడు. కండక్టర్ ఆలస్యం చేశాడని, దీంతో చెకింగ్ సిబ్బంది టికెట్ లేదని ఫైన్ వేశారని, రూ.420 ఫైన్ కట్టాల్సి వచ్చిందని, ఇదంతా కండక్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధిత యువకుడు ఆరోపించాడు. దీంతో కండక్టర్‌తో గొడవకు దిగాడు, కండక్టర్ కోపంతో యువకున్ని చెంపమీద కొట్టాడు. ఈ మేరకు ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తాను కండక్టర్ ని తిరిగి కొట్టలేదని, ఎదురు తిరిగితే నార్త్ ఇండియన్స్‌దే తప్పు అంటూ దు్రష్పచారం చేస్తారని అన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం కావాలని కోరతానన్నాడు.