
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏకంగా బీజేపీ ఎంపీ సోదరికే అత్తింటి వారి నుంచి వేధింపులు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్తగారి ఇంట్లో వారి అకృత్యాలు నిలదీసినందుకు మామ ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం, ఆమెను వీధిలోకి లాగి తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. యూపీలోని ఫరూఖాబాద్ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ సోదరి రీనా సింగ్‌కు 17 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటా జిల్లాలో వీరంతా నివాసం ఉంటున్నారు. అయితే, ఆదివారం అనూహ్యం ఘటన చోటుచేసుకుంది. రీనా సింగ్‌ను తన మామ లక్ష్మణ్ సింగ్, తన భర్త సోదరులు కలిసి.. నడి వీధిలో దారుణంగా కొట్టారు. కర్రలతో చితకబాదారు. తనను కొట్టవద్దని ఎంత వారించినా.. ఆగ్రహంతో ఊగిపోయి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. అనంతరం, తనపై జరిగిన దాడిపై రీనా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించారు. కొన్నేళ్లుగా తనను అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
देखिये योगीबाबा के जंगलराज में जब भाजपा सांसद मुकेश राजपूत की बहन को इस तरह पीटा जा रहा है, तो बाकी महिलाओं का क्या हाल होगा ? उनके ससुर ने बीच सड़क बेरहमी से 4 सेकेंड में 5 डंडे मारे। सांसद की बहन चीखती-चिल्लाती रही। कोई मदद को आगे नही आया । pic.twitter.com/Gukk8Xh34R
— Shyam Yadav SP (@shyamyadavsp95) September 8, 2025
ఈ సందర్భంగా రీనా సింగ్ మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం నేను స్నానం చేస్తున్న సమయంలో మామ, తన మరిది కలిసి బాత్‌రూమ్ కిటికీ నుంచి ఫోన్‌లో వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయమై నేను వారిని ప్రశ్నించడంతో నాపై దాడి చేశారు. నా కుమార్తెను కూడా దారుణంగా కొట్టారు. చాలా రోజులుగా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో, రీనా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు బీజేపీ ఎంపీ సోదరి కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.