పార్టీ పెట్టిన పది రోజుల్లోనే.. 

BJP Leader SV Sekar Talk About Rajinikanth Political Party - Sakshi

రజనీకాంత్‌ ఈ పేరు ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయరంగంలోనూ ట్రెండింగ్‌గా మారింది. ఇండియన్‌ సూపర్‌స్టార్‌గా ఇప్పటికీ వెలిగిపోతున్న ఈ 69 ఏళ్ల నటుడు రజనీకాంత్‌. ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా అన్నాత్త  చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సీవీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్‌ కథానాయికలు నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. కాగా రజనీకాంత్‌ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పుడు. చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయన గురించి ఆసక్తిని రేకేతిస్తున్న మరో అంశం రాజకీయ రంగ ప్రవేశం. అవును రజనీకాంత్‌ రాజకీయాలకు రావాలన్నది ఆయన అభిమానులు 30 ఏళ్ల కల. వారి ఆకాంక్షను నెరవేర్చే విధంగా గత ఏడాది క్రితం రజనీకాంత్‌ త్వరలో రాజకీయపార్టీని నెలకొన్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. (రజనీ రాజకీయ ప్రవేశం ఉంటుందా..?)

అయితే ఆయన ఇప్పటివరకు పార్టీని ప్రకటించలేదు. దీంతో రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశానికి సుముఖంగా లేరని, ఆయన పార్టీని పెట్టే ఆలోచన లేదనే అభిప్రాయాన్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉందని ప్రసారం ఓ పక్క జరుగుతోంది. కాగా తమిళనాడులో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో, మేలో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే రాజకీయ పార్టీ పై రజనీకాంత్‌ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. దీంతో ఆయన అభిమానుల్లో తమ తలైవా రాజకీయ పార్టీని ప్రారంభిస్తారా లేదా అన్న శంక పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్‌ నటుడు, బీజేపీ పార్టీ కార్యకర్త ఎస్‌వీ.శేఖర్‌ మాట్లాడుతూ ఇప్పుడు రజనీరాజకీయ రంగ ప్రవేశం గురించి అధికంగా చర్చ జరుగుతోందని అన్నారు. (రాయని డైరీ : రజనీకాంత్ (సూపర్ స్టార్))

ఎన్నికలు దగ్గర పడడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి అభిమానుల్లో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. అయితే రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన పది రోజుల్లోనే ఎన్నికలు వచ్చినా, ఆయన ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. తమిళ ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తారని యస్‌వీ.శేఖర్‌ పేర్కొన్నారు. దీంతో రజనీరాజకీయం మరోసారి ట్రెండింగ్‌ మారింది. కాగా ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ కాలాన్ని కీలంవాక్కంలోని తనను ఫాంహౌస్‌లో గడుపుతున్న రజనీకాంత్‌  అక్కడ రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  (రజనీ ఫారిన్ కారు: ఇంత పెద్ద స్టోరీనా!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top