
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాతే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాముంది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను కమలదళం కీలకమైనవిగా భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తే సంస్థాగత సమతుల్యత దెబ్బతింటుందని అధిష్టానం భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడి మార్పు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, బిహార్ ఎన్నికల ఫలితాలు కొత్త అధ్యక్షుడి ఎంపికలో కీలకంగా మారనున్నాయి. సంస్థాగతంగా, మంత్రి వర్గంలో రాష్ట్ర స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. జాతీయ అధ్యక్షుడి రేసులో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.