
ఆరెస్సెస్ జోద్‌పూర్ భేటీలో నిర్ణయం!
న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వేగవంతం చేసింది. నూతన అధ్యక్షుడి పేరును అతి త్వరలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. సెపె్టంబర్ 5 నుంచి 7 దాకా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగే ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నాయకత్వ సమావేశం ఇందుకు వేదిక కానుంది. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఈ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే, ముఖ్య సంఘ్ నేతలు, అనుబంధ విభాగాల నేతలతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యనేతలు కూడా చర్చల్లో పాల్గొంటారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలపైనా భేటీలో చర్చిస్తారు. మరోవైపు పలు కీలక రంగాల ప్రముఖులతో భాగవత్ ఈ నెల 26 నుంచి 28 దాకా ఢిల్లీలో భేటీ కానున్నారు.