ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
మోరల్ పోలీసింగ్ అంశం దేశంలో తరచూ చర్చకు వస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళల వేసుకునే దుస్తులు, వ్యక్తిగత ఎంపికలు, ప్రవర్తనపై అనవసర వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు వంటి ఘటనలు తరచూ పెద్ద డిబేట్‌కు దారి తీస్తున్నాయి. “వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది?.. సమాజం పేరు మీద నియంత్రణ ఎక్కడ మొదలవుతుంది?” అనే ప్రశ్నలు ప్రతి సారి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఓ విద్యార్థిని, ఓ మహిళ మధ్య దుస్తులపై జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాంలో ఓ చిన్న వీడియో ఇప్పుడు పెద్ద సామాజిక చర్చకు దారి తీసింది. పనికోసం బయటకు వెళ్లిన ఓ విద్యార్థినిపై ఓ పెద్దావిడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నీ బట్టలే నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాయి” అంటూ జరిగిన ఆ వాగ్వాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. “మోరల్ పోలీసింగ్” మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది
తేజ్‌పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అనుష్క శర్మ తన ప్రాక్టికల్ పరీక్ష కోసం అవసరమైన మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు స్కూటర్‌పై బయటకు వెళ్లింది. అదే సమయంలో రోడ్డుపై ఓ వృద్ధ మహిళ ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజం చెడిపోతుంది. ఏం చేద్దామని ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వచ్చావ్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వేడెక్కించాయి. అంతేకాదు, “క్యారెక్టర్‌లెస్” వంటి పదాలు ఉపయోగించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.
రికార్డింగ్‌తో బయటపడ్డ వివాదం
ఈ ఘటనను అనుష్క స్వయంగా తన మొబైల్‌లో రికార్డ్ చేసింది. వీడియోలో ఆమె తన దుస్తులపై ఎందుకు ఇంత విమర్శ వస్తోందని ప్రశ్నించినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో వృద్ధ మహిళ కూడా ఆమెను చిత్రీకరిస్తూ తన అభిప్రాయాన్ని కొనసాగించింది. వీడియోలో అనుష్క నలుపు రంగు ట్యాంక్ టాప్, ట్రౌజర్స్ ధరించి కనిపించింది. దుస్తులపై విమర్శలు పెరుగుతుండగా, ఆమె ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతోంది.
హాట్ డిబేట్
వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలామంది యువతులు, మహిళా హక్కుల సంఘాలు అనుష్కకు మద్దతు తెలుపుతూ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు వేస్తున్నాయి. “ఎవరికి ఏం వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికుంది?” అనే కామెంట్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన “మోరల్ పోలీసింగ్ vs వ్యక్తిగత స్వేచ్ఛ” అనే పెద్ద చర్చగా మారింది.
A viral video from Tezpur has triggered a huge debate online. A student was allegedly shamed publicly over her clothes, but she chose to speak up instead of staying silent.#Assam #Tezpur #ViralVideo #WomenRights pic.twitter.com/wNq8TDmVbz
— Kaushiki Dey (@De7845Dey) June 2, 2026


