
హరిద్వార్ : అఖిల భారత అఖాడా పరిషత్ హరిద్వార్ అర్ధ కుంభమేళా- 2027కు ప్రతిపాదిత తేదీలను ఆమోదించడంతో ఈ ఉత్సవానికి కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం త్వరలో అర్ధ కుంభ క్యాలెండర్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, వివిధ అఖాడాలకు చెందిన సాధువులు ఈ ఉత్సవం కోసం తరచూ సమావేశమవుతున్నారు.
Haridwar | Chief Secretary Anand Bardhan conducted an on-site inspection of the mela area today to ensure that the 2027 Kumbh Mela in Haridwar is organized in a grand and divine manner, and to provide all essential facilities to the visiting devotees along with reviewing the… pic.twitter.com/8hcnP8ZnPe
— ANI (@ANI) September 12, 2025
హరిద్వార్‌లో జరిగే అర్ధ కుంభమేళా- 2027కు సంబంధించిన మూడు ప్రధాన పుణ్య స్నానాల షెడ్యూల్ ను అఖాడా పరిషత్ ఖరారు చేసింది. 2027 మార్చి 6, మార్చి 8, ఏప్రిల్ 14 తేదీలలో ఈ షాహీ స్నానాలు జరగనున్నాయని తెలిపింది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అర్ధ్ కుంభమేళా ప్రధానంగా హరిద్వార్, ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లలో జరగుతుంటుంది.