
ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం ఉదయం బర్గఢ్‌లో సున్నపురాయిని తీసుకెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అయిదు బోగీలు పక్కకు ఒరిగాయి. రైలు బర్గఢ్ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ గాయాలు అవ్వలేదని అధికారులు వెల్లడించారు. అంతేగాక ఈ గూడ్స్ రైలు ఇండియన్ రైల్వేకు చెందినది కాదని.. ACC సిమెంటు కంపెనీకి చెందినదని రైల్వే అధికారుల ప్రకటించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదని వెల్లడించారు.
Breaking News..
— INC TV (@INC_Television) June 5, 2023
Another train derails in Bargarh,Odisha. pic.twitter.com/tIoSMuVvmo
కాగా శుక్రవారమే ఒడిశాలో ఘోర రైళ్ల ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1000కి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇంత భారీ విషాదం జరిగిన మూడు రోజులకే మరో రైలు పట్టాలు తప్పడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఒడిశా రైలు దుర్ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్(ఈఐ) వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులే కారణమని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బాధ్యులను గుర్తించామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, రైలు సేఫ్టీ కమిషనర్ త్వరలో నివేదిక అందజేస్తారని వెల్లడించారు. సిగ్నలింగ్‌లో లోపాల కారణంగానే రైలు ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది.
చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదం: ‘కూతురి మొండితనమే ప్రాణాలు నిలబెట్టింది’