షర్ట్‌ కింద గోల్డ్‌ దాచి స్మగ్లింగ్‌ .. ఎయిర్‌ ఇండియా క్యాబిన్‌ క్రూ అరెస్ట్‌

Air India Cabin Crew Arrested For Gold Smuggling - Sakshi

క్రైమ్‌: బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఎయిర్‌ ఇండియా క్యాబిన్‌ సిబ్బందిని బుధవారం అధికారులు కేరళలో అరెస్ట్‌ చేశారు. బహ్రైన్‌-కోజికోడ్‌-కోచి సర్వీస్‌లో సదరు సిబ్బంది పని చేస్తున్నాడు. నిందితుడిని  వయనాడ్‌(కేరళ)కు చెందిన షఫీగా గుర్తించారు. 

షఫీ బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నాడనే పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. బుధవారం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈలోపే కస్టమ్స్‌ అధికారులు పట్టేసుకుని.. షఫీ నుంచి 1,487 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బుధవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ సింగపూర్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. మూడున్నర కోట్ల​ విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top