Covid:గాలిలో 10 మీటర్లు దూరం వరకు

Aerosols Can Travel 10 Metres Govt New Pointers On Covid - Sakshi

కరోనా వ్యాప్తికి తుంపర్లు, ఏరోసోల్స్‌ ముఖ్య కారకాలు

వెంటిలేషన్‌తో కరోనా గాలికి చెక్‌

రెండు మాస్క్‌లు వాడటం మేలు

న్యూఢిల్లీ: గాలి ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం నేడు కీలక విషయాలు వెల్లడించింది. అది ఏంటంటే మనం తుమ్మినా, దగ్గినా తుంపర్లు సాధారణంగా రెండు మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. కానీ ఏరోసోల్స్‌ అంటే అతి సూక్ష్మమైన తుంపర్లు ఏకంగా 10 మీటర్ల దూరం ప్రయాణం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కార్యాలయం గురువారం విడుదల చేసిన నూతన మార్గ దర్శకాల్లో వెల్లడించింది. ఫలితంగా వైరస్‌ కట్టడి కోసం మాస్క్‌, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. 

సూచనలు..
ఈ క్రమంలో వైరస్‌ కట్టడికి మాస్క్‌, భౌతిక  దూరం పాటించడంతో పాటు ఇళ్లల్లో వెంటిలేషన్‌ని పెంచుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్‌ సోకే ముప్పును వెంటిలేషన్‌ తగ్గిస్తుంది. ఇంట్లో ఉండే కిటికీలు, తలుపులు వంటి ఎగ్జాస్ట్‌ సిస్టంతో చెడు వాసనలు బయటకు వెళ్లాయి. అలానే అదే ప్రాంతంలో ఫ్యాన్‌లు పెడితే వైరస్‌తో కూడిన గాలి బయటకు పోయి కోవిడ్‌ సోకే ముప్పు తగ్గుతుంది అని తెలిపింది. 

లక్షణాలు లేని వ్యక్తులు కూడా వైరస్‌ని వ్యాప్తి చేస్తారు. సాధారణంగా కరోనా బారిన పడి వ్య‍క్తి నుంచి విడుదలయ్యే లాలాజలం, ముక్కు నుంచి వెలువడే తుంపర్లు, ఏరోసోల్స్‌ రూపంలో ఉండే అతి సూక్ష్మ తుంపర్లు వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారకాలు. పెద్ద తుంపర్లు భూమీ ఉపరితలం మీద పడతాయి. అవి పడిన ప్రదేశాలను ఇతరులు తాకితే వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఇంటి లోపల నేల, తలుపు హ్యాండిల్స్‌ వంటి వాటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను తరచుగా సబ్బు, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. 

ఇక చిన్న తుంపర్లు అయిన ఏరోసోల్స్‌ గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో ఈ ఏరోసోల్స్‌ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లో వెంటిలేషన్‌ బాగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచాలి. 

పని చేసే ఆఫీసుల్లో ఏసీలు వేసి, మొత్తం మూసేస్తారు. దాని వల్ల వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో పాటు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయాలి అని సూచించారు. 

రెండు మాస్క్‌లు వాడటం మేలు..
కరోనా కట్టడిలో మాస్క్‌ కీలకం. రెండు మాస్క్‌లతో మరింత ప్రయోజనం అంటున్నారు నిపుణులు. సర్జికల్‌ మాస్క్‌తో పాటు కాటన్‌ మాస్క్‌ కలిపి పెట్టుకోవాలి. ఎన్‌ 95 మాస్క్‌ వాడటం శ్రేయస్కరం. భారతదేశంలో ఇప్పటి వరకు కనీసం 2.57 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.87 లక్షల మంది మరణానికి దారితీసింది.

చదవండి: Black Fungus: ఆయుర్వేదంతో చెక్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-05-2021
May 21, 2021, 06:23 IST
కోల్‌కతా: దేశంలో కోవిడ్‌ పరిస్థితిపై గురువారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో కొన్ని రాష్ట్రాల సీఎంల పట్ల మోదీ వ్యవహరించిన తీరుపై...
21-05-2021
May 21, 2021, 06:11 IST
న్యూఢిల్లీ: రోజూవారీ కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం రోజుకు 16–20 లక్షల కరోనా...
21-05-2021
May 21, 2021, 06:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజూ కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పోల్చితే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది....
21-05-2021
May 21, 2021, 05:27 IST
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోలా కరోనా సోకింది. ఐసోలేషన్‌లో ఉంటూ, జాగ్రత్తగా మందులు వాడుతూ.. కరోనా నుంచి బయటపడ్డారు.. మరి...
21-05-2021
May 21, 2021, 05:27 IST
న్యూఢిల్లీ: పిల్లలు, యువతలో కరోనా వైరస్‌ వ్యాప్తిని, వారిపై దాని ప్రభావాన్ని, తీవ్రతను నిశితంగా పరిశీలించి, రికార్డు చేయాలని ప్రధానమంత్రి...
21-05-2021
May 21, 2021, 05:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య వ్యవస్థకు మరో వ్యాధి సవాల్‌ విసురుతోంది. కరోనా...
21-05-2021
May 21, 2021, 05:03 IST
బ్లాక్‌ ఫంగస్‌ తరహాలోనే మనపై దాడిచేసే మరో మహమ్మారి.. వైట్‌ ఫంగస్‌. దీని అసలు పేరు కాండిడా అల్బికాన్స్‌. ఇది...
21-05-2021
May 21, 2021, 03:02 IST
న్యూఢిల్లీ: కేవలం ఒకే ఒక సెకనులో కరోనా నిర్ధారణ ఫలితాన్ని బయటపెట్టే సెన్సార్‌ సిస్టమ్‌ను తాము అభివృద్ధి చేశామని అమెరికాలోని...
21-05-2021
May 21, 2021, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించి వారిలో ధైర్యం నింపడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం...
21-05-2021
May 21, 2021, 02:39 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది....
21-05-2021
May 21, 2021, 02:25 IST
సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: ఇది ఒక్క దస్రు, పరిస్థితే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రజలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు....
21-05-2021
May 21, 2021, 02:04 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా సోకి, కోలుకున్నామన్న సంతోషం తీరకముందే బ్లాక్‌ ఫంగస్‌ కాటేస్తోంది. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చేశామన్న ఆనందం రెండుమూడు...
21-05-2021
May 21, 2021, 00:15 IST
కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో పాతికవేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంచు మనోజ్‌ తెలిపారు....
21-05-2021
May 21, 2021, 00:15 IST
ప్రముఖ దర్శక–నిర్మాత, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) వియ్యంకుడు యు. విశ్వేశ్వర రావు (92) ఇక లేరు. గురువారం...
20-05-2021
May 20, 2021, 20:35 IST
లక్నో : గంగానదిలో వందకుపైగా కోవిడ్‌ మృతదేహాలు తేలుతూ కనిపించటంతో దేశవ్యాప్తంగా కల్లోలం చెలరేగింది. ఆ ఘటన మరువక ముందే కోవిడ్‌...
20-05-2021
May 20, 2021, 19:22 IST
చెన్నై: టీమిండియా టెస్టు ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అభినవ్‌ ముకుంద్‌ తాత టీ. సుబ్బారావు(95) కరోనాతో పోరాడుతూ...
20-05-2021
May 20, 2021, 18:36 IST
జెనీవా: కరోనా చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు...
20-05-2021
May 20, 2021, 17:55 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,610 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,18,247...
20-05-2021
May 20, 2021, 14:22 IST
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఇండియా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ గత 53 ఏళ్లుగా ప్రవాస భారతీయుల సంక్షేమానికి ​కోసం...
20-05-2021
May 20, 2021, 12:40 IST
న్యూఢిల్లీ: ఓవైపు మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంటే..  మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకోర్‌మైకోసిస్) సైతం పంజా విసురుతోంది. కోవిడ్‌​ నుంచి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top