కోల్‌కతా: ఆకాశ్ సింగ్.. పశ్చిమ బెంగాల్‌లో అతడో రౌడీ.. హౌరా 'డాన్'గా అతడికి పేరుంది. అదే హౌరా రోడ్లపై అతడిని ఇప్పుడు లోదుస్తులతో ఊరేగించారు పోలీసులు. 2021లో పోలీసులపై కాల్పులు జరపడంతో పాటు, 20కి పైగా బాంబులు విసిరినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అతడిని ఈ నెల ఆరంభంలోనే అరెస్టు చేసినప్పటికీ, రౌడీలందరికీ ఒక గట్టి హెచ్చరిక పంపే ఉద్దేశంతో ఈ రోజు ఇలా ఊరేగించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్న సమయంలో పోలీసులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు అనేవారు. పోలీసులపై దాడులు జరుగుతున‍్నప్పటికీ మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోయేవారని బీజేపీ నేతలు ఆరోపించేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారికంలోకి రావడంతో పోలీసుల వైఖరిలో కూడా పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు రౌడీల భరతం పడుతున్నారు పోలీసులు. ఇక పాతరోజులు పోయాయని, సీఎంగా సువేందు వచ్చారని రౌడీలకు రౌడీలే చెప్పుకోవాలని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.
హౌరా జిల్లా పోలీసులు చేపట్టిన క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ సమయంలో ఆకాశ్ సింగ్‌ను లోదుస్తులతో తీసుకెళ్లారు. మాలిపాంచ్‌ఘడా, గోలాబాడి పోలీస్ స్టేషన్ల జాయింట్ టీమ్ ఆకాశ్ సింగ్‌ను తీసుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టింది. ఆకాశ్‌పై తేలాబాజీ, సిండికేట్ నిర్వహణ, ఒక పోలీస్ అధికారిని నేరుగా లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం లాంటి తీవ్ర కేసులు ఉన్నాయి. పాత కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, నేరానికి ప్లాన్ ఎలా రూపొందిందో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ చేపట్టారు. ఆకాశ్ కేవలం బనియన్, షార్ట్స్‌లో కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
అయితే, జనాల ముందు నిందితుడిని ఇలా అర్థనగ్నంగా తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు కూడా దారితీస్తోంది. మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాల వాదన ప్రకారం, చట్ట పరిధిలో కేసుల దర్యాప్తు చేయడం, క్రైమ్ సీన్ రీక్రియేషన్ నిర్వహించడం పోలీసుల హక్కే. కానీ నేరస్థుడైనప్పటికీ ఒక వ్యక్తిని ఇలా ప్రజల ముందు అర్ధనగ్నంగా తిప్పడం అభ్యంతరకరమని అంటున్నారు.
ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని వారు ఆరోపించారు. అయితే జిల్లా పోలీసులు స్పందిస్తూ.. ఎలాంటి చెడు ఉద్దేశంతోనూ ఈ పని చేయలేదని, పాత కేసుల ముడి విప్పడం, నేరానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు సేకరించడం లక్ష్యంగానే ఈ చర్య చేపట్టామని తెలిపారు. ఈ నేర ముఠా వెనుక ఉన్న ఇతరుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
హౌరా 'డాన్'గా పిలువబడే ఆకాష్ సింగ్‌ను, హౌరా వీధుల్లో కేవలం లోదుస్తులతో ఊరేగించారు.
2021లో పోలీసులపై కాల్పులు జరపడంతో పాటు, 20కి పైగా బాంబులు విసిరినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు ఇతన్ని ఈ నెల ఆరంభంలోనే అరెస్టు చేసినప్పటికీ, రౌడీలందరికీ ఒక గట్టి హెచ్చరిక పంపే ఉద్దేశంతో ఈ… pic.twitter.com/Bn74zszZTb— StuN GuN🚩 (@stun_gun22) May 25, 2026


