
దిస్పూర్: అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం అస్సాంలో 5.71 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని జీఎఫ్‌జెడ్ తెలిపింది.
అస్సాంలోని గౌహతిలో సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు ఉత్తర బెంగాల్,పొరుగున ఉన్న భూటాన్ వరకు సంభవించాయి. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.
తూర్పు హిమాలయ సింటాక్సిస్‌లో యురేషియన్, సుండా ప్లేట్‌ల కలయిక వద్ద అస్సాం ఉంది. కాబట్టే అస్సాంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని రోజుల తర్వాత ఇవాళ మరోసారి భూమి కంపించడం గమనార్హం.