దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు | 25166 New Corona Cases Recorded In India | Sakshi
Sakshi News home page

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Aug 17 2021 10:52 AM | Updated on Aug 17 2021 10:59 AM

25166 New Corona Cases Recorded In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా  25,166 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 437 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 4,32,079 మంది ప్రాణాలు కోల్పోయారు.  అంతేకాకుండా గత 24 గంటల్లో 36,830 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం  3,14,48,754 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.  దేశంలో ప్రస్తుతం 3,69,846 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,22,50,679 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 55,47,30,609 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.51శాతంగా ఉంది. ఇక దేశంలో ఇప్పటి వరకు 49,66,29,524 మందికి కోరోనా పరిక్షలు నిర్వహించినట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement