నారాయణపేట: జాతీయ ఆయుష్ మిషన్ పబ్లిక్ హెల్త్‌ప్రోగ్రామ్ కింద జిల్లాలో 8 ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.40 వేలు, ఒక ఫార్మసిస్ట్ పోస్టుకు రూ.15 వేలు, ఒక సైకోసోషియల్ కౌన్సిలర్ పోస్టుకు ఒక్కో సెషన్‌కు రూ.500, యోగా ప్రొఫెషనల్ పోస్టుకు నెలకు రూ.28 వేలు, రెండు మల్టీపర్పస్ వర్కర్ పోస్టులకు నెలకు రూ.15 వేల చొప్పున వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. 2026, జూలై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు, రిజర్వేషన్లు వర్తిస్తాయని వివరించారు. ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తును స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆ రోగ్య కార్యాలయం, సింగారం గేట్, నారాయణపేట–509210 చిరునామాకు పంపించా లని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని సూచించారు.
ప్రకృతి వ్యవసాయంపై
కృషి సఖిలకు శిక్షణ
నారాయణపేట: రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా వ్యవసాయశాఖ, గ్రామభారతి ఫౌండేషనన్ సంయుక్తంగా జిల్లాకేంద్రంలోని జేసీ ఫామ్స్‌లో శనివారం కృషి సఖీలకు ఐదురోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌న్ లక్ష్యాలు, నేల ఆరోగ్య పరిరక్షణ, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను గ్రామస్థాయిలో రైతులకు చేరవేయడంలో కృషి సఖీలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. గ్రామభారతి ఫౌండేషన్ చైర్మన్, డీఎంహెచ్‌ఓ డా. జయచంద్రమోహన్‌న్ మాట్లాడుతూ.. శిక్షణలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్యకర ఆహారం, వివిధ కషాయాలు, జీవామృతం తయారీ, వినియోగం, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై క్షేత్రస్థాయి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లోని రైతులకు వివరించి ప్రకతి వ్యవసాయ విస్తరణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి సహాయ వ్యవసాయ సంచాలకుడు రామకృష్ణ, నారాయణపేట ఏఓ దినకర్, గ్రామభారతి ఫౌండేషన్ సభ్యుడు సత్యనారాయణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సభ్యుడు ఉపేందర్, వివిధ మండలాలకు చెందిన కృషి సఖీలు, రైతులు పాల్గొన్నారు.


