రోజుకు 30 మందికి ఉపాధి.. | - | Sakshi
Sakshi News home page

రోజుకు 30 మందికి ఉపాధి..

Oct 11 2026 10:05 AM | Updated on Oct 11 2026 10:05 AM

1,050 మంది మహిళా సంఘాల సభ్యుల వాటాదారులతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్వహిస్తున్నాం. పండ్ల సేకరణ నుంచి గుజ్జు తయారీ వరకు వివిధ పనుల ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తోంది. ఈ యూనిట్‌ మహిళల స్వయం ఉపాధికి తోడ్పడుతోంది. – కావేరి, బోర్డు డైరెక్టర్‌, ఎఫ్‌పీసీ

40 క్వింటాళ్ల కొనుగోలు..

ఎనిమిది రోజుల్లో 40 క్వింటాళ్లకు పైగా సీతాఫలాలను కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు 150 కిలోల గుజ్జును తయారుచేసి విక్రయానికి సిద్ధంగా ఉంచాం. ఆశించిన స్థాయిలో పండ్లు లభిస్తే మరింత మందికి ఉపాధి లభించడంతో పాటు మంచి లాభాలు సాధించవచ్చు.

– సుజాత, చైర్మన్‌, ఎఫ్‌పీసీ

ఉపాధే లక్ష్యంగా యూనిట్‌ ఏర్పాటు..

మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎఫ్‌పీఓలను ప్రోత్సహిస్తున్నాం. రూ.10 లక్షల పెట్టుబడితో ఏర్పాటైన సీతాఫల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ద్వారా వచ్చిన లాభాలను వాటాదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పండ్ల లభ్యత తగ్గినా కేంద్రాన్ని కొనసాగిస్తున్నాం.

– నారాయణ, ఏపీఎం, నారాయణపేట

అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యం..

జిల్లాలో మాత్రమే ఈ యూనిట్‌ ప్రత్యేకంగా కొనసాగుతోంది. గతంలో మూడు యూనిట్లు ఉండగా.. వర్షాభావంతో ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి తగ్గడంతో ఒకే కేంద్రాన్ని ప్రారంభించాం. సీతాఫల గుజ్జు ద్వారా నారాయణపేటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం.

– వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement