పండ్ల సేకరణ నుంచి ప్యాకింగ్‌ వరకు.. | - | Sakshi
Sakshi News home page

పండ్ల సేకరణ నుంచి ప్యాకింగ్‌ వరకు..

Oct 11 2026 10:05 AM | Updated on Oct 11 2026 10:05 AM

ఈ నెల 2న గాంధీజయంతికి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి సీతాఫలాలను సేకరించి గుజ్జు తయారీ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 క్వింటాళ్ల సీతాఫలాలను కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మాగిన పండ్ల నుంచి ఇప్పటి వరకు 150 కిలోల గుజ్జును తయారుచేసి విక్రయానికి సిద్ధం చేశారు. సేకరించిన పండ్లను మాగబెట్టడం, గుజ్జు, విత్తనాలను వేరు చేయడం, ప్యాకింగ్‌ చేయడం, ఫ్రీజర్లలో నిల్వ చేయడం వంటి పనులు మహిళలే నిర్వహిస్తున్నారు. కిలో సీతాఫలాన్ని రూ.16 చొప్పున కొనుగోలు చేస్తుండటంతో స్థానికంగా పండ్లు సేకరించి తెచ్చేవారికీ ఆదాయం లభిస్తోంది. ప్రాసెసింగ్‌ కేంద్రంలో పనిచేసే వారితో పాటు పండ్ల సేకరణ, రవాణా వంటి పనుల్లోనూ గ్రామీణులకు ఉపాధి దొరుకుతోంది. రోజుకు సుమారు 30 మంది ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, పండ్లు సరఫరా చేసే మరో 30 మందికి ఉపాధి లభిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement