ఉత్సవాల నాటికి రాజగోపురం పూర్తి కావాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాల నాటికి రాజగోపురం పూర్తి కావాలి

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

మక్తల్‌: డిసెంబర్‌లో జరిగే ఉత్సవాల నాటికి రాజగోపురం నిర్మాణ పనులు నాణ్యతగా పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. సోమవారం పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న రాజగోపురం పనులను ఆయన పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రూ.50 లక్షలు మంజూరయ్యాయని.. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట ఆలయ చైర్మన్‌ ప్రాణేష్‌చారి, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement